తెలివైన రవి( బాలల కథ)-మమత ఐల-=హైదరాబాద్-9247593432


   రవి తెలివైన విద్యార్థి ఆటల్లో ఫస్ట్ , పాటల్లో ఫస్ట్ , చదువులో ఫస్ట ,ఆర్ట్ ( బోమ్మలు గీసి రంగులద్దడం)లో కూడా ఫస్ట్  ఒకరోజు పోటీల కోసం వాల్ల మాస్టారు తీసుకెల్లారు అక్కడ ఎవరి విద్యను వారు ప్రదర్శిస్తున్నారు. రవి పులికి పిల్లికి వున్న తేడాను బొమ్మ గీసి ప్రదర్శిస్తున్నాడు. 

             బొమ్మగీయడమైపోయింది. రంగులు కూడా వేస్తున్నాడు. వేదికపైన వేదికను గమనిస్తున్న పిల్లలందరు ఎక్కిరించడం మొదలు పెట్టారు. "హే..తోక అటు బాగారాలేదు, హే...రంగులు సరీగా అద్దలేదు" అని రవిని ఆటపట్టిస్తున్నారు. ఐనా రవిచలించకుండ తన ప్రదర్శన నంతా పూర్తిచేశాడు. తరువాత వేదిక చూస్తున్న వారితో ఇలా అన్నాడు. "ఫ్రెండ్స్ మీలో ఎవరికైన నేను గీసిన బొమ్మలో లోపాలు సవరించవస్తె సవరించండి" ఇక్కడకు వచ్చి అని 

       ఇంతవరదాక లోపాలను ఎత్తి చూపినవారు ఏమి మాట్లాడకుండ గప్ చుప్ ఐపోయారు. ఎవ్వరు ముందుకు రాలేదు . 

*అక్కడున్న పెద్ద,పెద్ద వాళ్లంత రవిని మెచ్చుకున్నారు.

   అక్కడ జడ్జ్ మెంట్ ఇచ్చే మాస్టారు వచ్చి రవిగీసిన బొమ్మ మీద మంచి సమీక్షను చెప్పాడు.

గేలి చేసిన పిల్లలంతా బిక్క మొహాలు వేసారు. 

* నీతి :— విమర్శించటం చాలా తేలిక

* సవరించటం కష్టం