రావమ్మా :--- మమత ఐల-హైదరాబాద్-9247593432

 చిన్ని చిన్ని రావమ్మ

అమ్మ మాటను వినవమ్మ


లేగదూడను చూడమ్మ

అమ్మకోసమది చూసేను


దూడను తలుగుకు కట్టమ్మ

ఆవుకు మేత వేయమ్మ


పచ్చిగడ్డిని తింటుంది

చిక్కని పాలనిస్తుంది


దూడకు సగము మనకు సగం

ఆవు పాలెంతొ బలం బలం


అమ్మ చెప్పేది నిజమమ్మ

శ్రేష్టమైనవి పాలమ్మ


ఆవుకు సేవ చేయాలె

అమ్మ లాగ ఆరాదించాలె

ఆవు పాలను తాగేసి

ఆవుకు చెప్పుము 

జయం జయం