చెట్టు(బాలగేయం):మమత ఐల:-హైదరాబాద్--9247593432


 విత్తు నాటంగనే మొలకగా లేచింది

ఆకులను వేసింది కొమ్మలతొఎదిగింది

పువ్వులను పూచింది కాయలను కాచింది

అతిపెద్ద వృక్షమై కళ్లెదుట నిలచింది


ఏపుగా పెరిగింది చెక్కలను ఇచ్చింది

వడ్రంగి చేతిలో వంకలను తిరిగింది

కుర్చీలుగా మారి ఇంట్లోకి వచ్చింది

చూడ చక్కని విధము చూస్తుంటె అందము


కూరిమిని పంచింది కూర్చుండ మంటుంది

ఇంటిల్లిపాదికి అవసరం పెంచింది

చిన్నపాటివిత్తు మహత్యమెంతో మత్తు

మరపురానిది చెట్టు మనకన్న పైమెట్టు

 

ప్రాణవాయువు నిచ్చి పదుదుగురిని రక్షించి

నరులకన్నను మేలు తరువులని చెప్పింది

హిమ శిఖరమైనది హితమునే చాటింది

ఇచ్చుటే నేర్చింది యింపుగల ఈ చెట్టు