అంజనేయునికి మ్రొక్కుదమఅన్ని విద్యలు నేర్చెదమ
రామ భక్త ఓఅంజన్న
రయమునరమ్ము అంజన్న
రామా , రామా అంటూవుంటే
రామ భజననే చేస్తుంటే
నువ్వొస్తావని అంటారు
నీ దీవెనలుండున నంటారు
అంజన్న నువు రావయ్య
మాకువిద్యలు నేర్పయ్య
చక్కగ గాలిలొ ఎగిరేవు
సముద్రాలన్ని దాటేవు
పక్షిలాగ రెక్కలు లేవు
ఎట్లా నీవు ఎగిరేవు
చిరంజీవిగా యిలలోనే
వున్నట్టి ఓ అంజన్న
రయమున నీవు వచ్చితివా
నీతో మేము ఆడెదము
విద్యలనన్ని నేర్చెదము
శ్రీహనుమాన్( బాల గేయం)మమత ఐల-హైదరాబాద్-9247593432