గోవర్థన గిరిదారుడు
గోపాలుడు శ్రీకృష్ణుడు
నల్ల నల్లని బాలుడు
నామాలున్న దేవుడు
ఆవు ప్రక్కననిలబడెను
అందాల శ్రీకృష్ణుడు
మురళిని వాయిస్తున్నాడు
మురలీనాథలోలుడు
నెమలి ఈకను తలలో పెట్టి
చెంగల్వ పూదండ మెడలోవేసి
బృందావనమున విహరిస్తున్న
రాధామాధవలోలుడు
మోహనకృష్ణా గోవిందా
గోపీనాథా గోవిందా
ముకుందమాధవ గోవిందా
దీనజనబంధు గోవిందా
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
గోవర్థనుడు( బాల గేయం) -మమత ఐల-హైదరాబాద్--9247593432