ఇంటి లోపలి ఆటలు-- ( బాల గేయం )మమత ఐల-హైదరాబాద్-9247593432

 ఎండా కాలం వస్తుంది

ఒకపూట సెలవు మనకొస్తుంది

ఎండల మనము తిరగొద్ధు

వడగాడ్పులకు ఆడొద్ధు


ఇంటిలోపలనె వుండాలి

ఇంన్డోర్ గేములనాడాలి

చెస్ అనుఆట వుంటుంది

చదరంగమని కూడ అంటారు


ఇంటి లోపల కూర్చోని

హాయిగ చెస్ నుఆడచ్చు

కమ్మగ కబుర్లు చెబుకుంటు

క్యారంబోర్డును ఆడొచ్చు


గచ్చకాయలు ఆడచ్చు

అష్టా చెమ్మలు ఆడచ్చు

చల్లని మజ్జిగ తాగేసి

ఆటలన్ని మనమాడుదము