రామ రామ దండాలు
ఉడతకిస్తివి నామాలు
రాముని దీవెన నువు పొంది
ధన్యమైతివి ఉడతమ్మ
అందమైన ఓ ఉడతమ్మ
చిరు ఆకారం నీదమ్మ
చెట్లను గుట్టల నెక్కేవు
దొరికి పండ్లను తింటావు
హాయిగ నువు జీవిస్తావు
అలసట లేకుండుంటావు
గుబులాంటి నీతోక చూడగ
ముచ్చట గొలుపును ఉడతమ్మ
చిట్టి మూతితో పండ్లను కొరికి
రుచి చూస్తున్న ఉడతమ్మ
మాకు కూడ ఓపండును కోసి
ఇవ్వరాద ఓ ఉడతమ్మ
ఉడత( బాల గేయం)-మమత ఐల-హైదరాబాద్-9247593432