బుజ్జమ్మ(బాల గేయం)--మమత ఐల--హైదరాబాద్--9247593432

 చిట్టి పొట్టి బుజ్జమ్మ

సర్రున ఇంటికి రావమ్మ

ఎండలు బాగా మండేను

ఆటలు ఇంక చాలమ్మ


నాన్న గారు వచ్చారు

బెత్తం తీసుక వచ్చేరు

సర్రున ఇంటికి రాకుంటె

బడితపూజను చేసేరు


చెప్పినట్టు నువు విన్నావో

బిస్కెట్లన్ని ఇస్తారు

చక్కని కబుర్లు చెబుతారు

ముద్ధూ మురిపెం చేస్తారు


చల్లని మజ్జిగ తాగేసి

హోంవర్కంతా చేసేసి

బంగరుతల్లిగ మెప్పులను

పొందవమ్మ నువ్వచ్చేసి