కాన్వెంట్ షురూ (బాలగేయం): --మమత ఐల--హైదరాబాద్-9247593432


 కాన్వెంట్లన్నీ తెరిచారు 

కరోనాకాలంముగిసింది

బద్దకమంతావదలండి     

  ప్రొద్దుననిద్దుర లేవండి


ఆంగ్లభాషలో అమ్మ ఆవును

అపురూపముగా చదవాలి

అ ఆ బదులు ఏ బీ సీ లను

ఉత్సాహంగా దిద్దాలి


ఆన్లైన్ క్లాసులు అటకెక్కాయి

అందరు బడికి వెళ్ళాలి

జనం మధ్యలో మనముండాలి

జగడాలన్నీ ఆపాలి


పరిశుభ్రతను పాటించాలి

బలపంపట్టి దిద్దాలి

ఇద్దరితగవులు ముద్దుగఆపి

బ్యాగులుపట్టుక నడవండి

టాటా బాయ్ బాయ్ చెప్పండి