అందమైనదీ పలకమ్మ
బలపం పట్టి దిద్దమ్మ
అ,ఆ,ఇ,ఈ నేర్వమ్మ
అమ్మా, నాన్నకు చూపమ్మ
పేపరు సురుమ తీయమ్మ
కఠిన పదాలు నేర్వమ్మ
మళ్ళీ మళ్ళీ రాయమ్మ
టీచరు మెప్పు పొందమ్మ
తెలుగు పుస్తకం చూడమ్మ
చదువుల తల్లివి కావమ్మ
గణగణ పాఠం చదవమ్మ
అందరి మన్నన పొందమ్మ
అమ్మా నాన్న మెచ్చేరు
పంతులమ్మలు మెచ్చేరు
తోటి బాలలు మెచ్చేరు
బహుమతు లెన్నో ఇచ్చేరు
చదువు(బాల గేయం):-మమత ఐల--హైదరాబాద్--9247593432