సూర్యుడు పుట్టిన రోజంట
రథసప్తమి అంటారంట
పొద్దు పొద్దున నిద్దుర లేచి
తలస్నానాలను చక్కగ చేసి
సూర్యుని పూజించాలంట
సంక్రాంతి గొబ్బల్ల పిడకలనన్ని
చక్కగ బయట కుంపటిపెట్టి
ఆ సెగతో పాలను పొంగించి
పాయసాన్ని చేస్తారంట
తొలుతపొడిచిన రవి కిరణాలు
పాలపొంగుపై కురిసే విధముగ
పాలను పొంగిస్తారంట
చిక్కుడాకులో నైవేద్యాన్ని
సూర్య దేవునికి నివేదించిన
ప్రసాదాన్ని తినవలెనంట
అది మన సాంప్రదాయమట
ఆరోగ్యము కెంతో మంచిదట
రథసప్తమి(బాలగేయం):-మమత ఐల--హైదరాబాద్9247593432