రంగురంగుల పక్షులు( బాల గేయం )-మమత ఐల-హైదరాబాద్-9247593432


 పిల్లలు చక్కగ కూర్చోండి

ఆలోచించి చెప్పండి


పక్షుల పేర్లు తెలుసు కద!

వాటి రంగులు తెలుసు కద!


కావు కావు మని అంటుంది

నల్లగ తాను వుంటుంది

దీని పేరును చెప్పండి


చిగురు పచ్చగా వుంటుంది

ముక్కు ఎర్రగా వుంటుంది

జోష్యాలెన్యో చెబుతుంది

ఈ పక్షి పేరును చెప్పండి


కుహు కుహుమని కూసేను

కమ్మగ పాట పాడేను

దీని రంగు మీకెరికేనా?

ఈపక్షి పేరును చెప్పండి


ఉత్తరాలను మోస్తుంది

సందేశాలను తెస్తుంది

దీన్నెపుడైనా చూసారా?

ఈపక్షిరంగును చెప్పండి


మనలను ప్రొద్దున లేపేను

కొక్కొరకో యని కూసేను

ఇంటి యందున పెచేరు

దీనినేమని పిలిచేరు?