సాక్షి శతకము: ‌ ‌-బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబరు:9290061336

 మానవుడు కడకు చేరుట/
తానెరిగియు యెరగనట్లు తహతహ పడుచున్/
హీనగుణంబులు మానడు/
జ్ఞానము మరుగౌట వలన సాక్షీ//(89)
   అంతా నాదేయని ర/
‌   రవ్వంతైనను తీసి కొనడు జచ్చిన వేళన్/
    చింతించడెపుడు నిన్నెద/
     సంతసపడడెంత కలిమి సమపడ సాక్షీ//(90)