సాక్షి శతకము:- -బెహరా ‌‌ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్:9290061336:


 శాంతము సత్యము చేతను/

ఎంతో సౌఖ్యంబు గలుగు ఎచ్చటనైనన్/ 

సంతసమున భగవంతుని, కీ/

ర్తించుట భక్తవరునికిదిపని సాక్షీ// (95) 


   భార్యా పుత్రులపై అని/ 

   వార్యంబగు మోహమందవలదని చెప్పన్/

   పర్యాలోచన చేయక/

   దుర్వ్పాపారముల దూది పోవుదురు సాక్షీ//(96)