అన్యత్ర చింత సేయక/పుణ్య నిందితుడైన హరిని పూని భజింపన్/
అన్యాః క్రాంతము సేయడు/
ధన్యాత్ములు జేసి కాచు ధరలో సాక్షీ//(97)
కాదనడు ఎట్టి వారిని/
లేదనడెవ్వరికి ఎట్టి నిందాస్తుతులన్/
మోదమున గాంచు చుండును/
సాధుల సంరక్షకుండు సదయుడు సాక్షీ//(98)
సాక్షి శతకము:- -బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:9290061336