సాక్షి శతకము:-బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు-9290061336


 జనులర్ధించుట చేతన్/

జనార్దన గోవింద పుండరీకాక్ష దయన్/

అనయము మాధవ రూపా/

గనుమో మధుసూదనుడ వీవు గావగ సాక్షీ// 101


     హృదయస్ధ జనార్దనుడవు/

     సదయుడ గోవింద పుండరీకాక్షుడవై/

     ముదమున మాధవ రూపుడ/

     వెద మధుసూదనుడవీవు వెలయగ సాక్షీ// 102