ఈశతక కంద పద్యము/లాసతొ సమకూర్చి శతకమాద్యంతంబున్/
దాసుల హృదయ నివాసుం/
డా సర్వేసునకు కృతిని అంకిత మిడితన్//(111)
సాక్షి యని మకుటమిడుటకు/
యేక్షణ మందైన నేను ఎరుగను గానన్/
రక్షకుడయ్యత్న గురుడై
సాక్షి శతకమెంతవరకు సాగెననంగా//(112)
సాక్షి శతకము:- -బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబర్: 9290061336