ఇచ్చినను ఇవ్వకున్నను/పశ్చాత్తాపంబు లేదు భగవంతునకున్/
మృచ్చులు వేడిన బ్రోచును/
తుచ్ఛుడజామిళుని బూని బ్రోచెను సాక్షీ//(99)
మత్స్యావతార శుభకర/
సత్యవతారుండ కూర్మ సాగరనిలయా/
అత్యుగ్ర వరహ రూపా/
నిత్యుడవో వామనావ నిర్మల సాక్షీ// (100)
సాక్షి శతకము: - -బెహరా ఉమామహేశ్వరరావు-సెల్ నెంబరు:9290062336