ఆచరణశీలి:-డి.కె.చదువులబాబు.ప్రొద్దుటూరు.-కడపజిల్లా-9440703716


 సోమనాథంగారనే పండితుడు ఉండేవాడు. ఆయన గొప్ప కవితాసంపన్నుడు. ఆయన కవిత్వానికి ప్రజలు మంత్రముగ్ధులయ్యేవారు. ఒకసారి సోమనాథంగారు జీవహింసను గురించి బోధిస్తున్నారు.

"జీవహింస మహాపాపం. మనకు ఎలాంటి అపకారం చేయని జీవులను హింసించడం రాక్షతత్వం"అని జీవహింస గురించి, మానవత్వం గురించి ఆయన ఉపన్యాసం ఇస్తున్నారు.

ఆసమయంలో ఓవ్యక్తిలేచి ఆయన దగ్గరకు వచ్చాడు.సోమనాథంగారు ఉపన్యాసాన్ని ఆపి,ఆవ్యక్తితో"ఏంనాయనా!నా ఉపన్యాసంలో నీకేమయినా సందేహం కల్గిందా?"అనిఅడిగారు.

అందుకావ్యక్తి "మీరేమీ అనుకోనంటే నాదొక చిన్నప్రశ్న.జీవహింస పాపమని చెప్పే మీరు జంతుచర్మంతో చేసిన చెప్పులను ఎలాధరిస్తున్నారు.ఏజంతువునూ హింసించకుండానే మీకాళ్ళకు చర్మంచెప్పులెలా వచ్చాయి?"అన్నాడు.

"నాలో ఉన్న పెద్దపొరపాటును చూపించిన మీకు నాకృతజ్ఞతలు" అని ఆయన తక్షణమే అక్కడికక్కడే చెప్పులను ఒదిలివేశాడు.ఆతర్వాత ఆయన జీవితంలో పాదరక్షలను వాడలేదు.