మంచుతెరలను చీల్చుకెళ్తుంటేచిరుగాలి ఎదురొచ్చిమరీ పలకరిస్తుంది!
అటుఇటు నిలబడి చూస్తున్న చెట్లు
స్వాగతగీతాలు ఆలపిస్తాయి!
ఎర్రటి రహదారి పై వెళ్తున్న ప్రతిసారి
నిశ్శబ్దం గా గమనిస్తూ
పక్షులు వెక్కిరిస్తాయి!
ప్రకృతిలోకి అడుగులు వేసినప్పుడల్లా
కొత్తగానే ఉంటుంది నాకు!
ఆత్మీయ అనురాగాలు
నింపుకున్నట్టు అనిపిస్తుంది!
ఉషోదయపు వేళ
మంచును స్పర్శించడం
అదొక అనుభూతి!!
ఉషోదయపు వేళ:-డా.గూటం స్వామి(9441092870)