చదువు విలువ (బాలగేయం )-రావిపల్లి వాసుదేవరావు 9441713136


 చదువు విలువ తెలుసుకో 

చదువు కొనీ మసలుకో 

చక్కగా చదివి నీవు 

మంచి వైపు సాగిపో 


చిన్ననాటి నుండి నీవు 

శ్రధ్ధగా చదవాలీ 

మంచి బుద్ధులు తోడుగ 

ఒదుగుతూ ఎదగాలి 


చదువు సంధ్యలు నీలో

చెడును తొలిగించాలీ 

మానవత్వము పెరిగి 

వెలుగులను నింపాలి 


నీవు నేర్పిన విద్య 

మార్పులనే తేవాలి 

అందరికీ నీ చదువు 

సాయమై నిలవాలి 


చదివిన చదువేమో 

ప్రగతి దారవ్వాలి 

అన్నార్తులే లేని 

స్వర్గసీమ కావాలి