మన మాతృభాష గొప్పతనం: ---గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్,నెం.9491387977.
 మనదైనా మనసైనా మహోన్నతమైనా మనమాతృబా‌ష గొప్పదనం ఆ చక్కదనం మనం చెప్పుకునే నేటి దినం ఈనాటి దినం ఘనమైనా ఇందనమైనా
మన బంధమై సంబంధమై నిలిచేటి మేటి నేటి తెలుగుభాష మూలధనం కవనమై వెలసిన మన అందరి కవితవనం .
ఇలలోనా తెలియని తెలుగువాడు లేడురా కలలోన గూడ మరువని వెలుగు రేడువు నీవురా గమనించి మనమంచి మన తెలుగు భాష ప్రాభవాన్ని చాటరా మృదుమధురమైన మన మాతృభాష వీణను నువు మీటరా
తేనె కన్న తీయనైన తెలుగుభాష మనదనీ ఇందనమనీ పూలతావి కన్న మిన్నయై వెలుగు తల్లి భాష 
ఆశ శ్వాస మేమని అదరకుండ 
బెదరకుండా విశ్వమంత చాటుతాం మా అశ్వగమన వేగంతో మా రాష్ట్రం సరిహద్దులనే దాటుతాం.
అజంతా భాషయై మా తల్లిభాష తెలుగు వెలుగు దారిలో సాగుతున్నది ముచ్చటైన అచ్చు పదాల ముగింపుతో ఇంపు సొంపు లతో తాను రేగుతున్నది అందమైన మన భాష ఆనందమైమన బందమై సుమ చందనాల నేలుతున్నది అందుకే అన్నారు కృష్ణదేవరాయలు దేశభాషలందు తెలుగు లెస్స యని సుద్దులు వినుకొని కనుగొని కలిసి మెలిసి సాగాలి మనం ముందుకు ఏకమై ఒకేలోకమై మనం చేస్తున్న మన మాతృభాష విందుకు.
పాలుగారు పిల్లల లాలిపాటలల్లుకున్న పసిపాపల పసిడిబుగ్గల భాష పలుకుబడుల కులుకులతో పరిఢవిల్లుతున్న వసివారని మా మోగ్గల భాష తలుకు బెలుకు తొనుకులతో తేలియాడుతున్న మా తెలుగు తల్లి  తొల్లి భాష ఆలనై పాలనై మా అందరి ఏలికై చుక్కలుగా మెరిసిపోవు చక్కని భాష ముద్దుల మూటగట్టు ముగ్దమనోహరం మాఈముద్దుల భాష హద్దపద్దు రాజ్యం మై బుధజనుల భోజ్యమై సురక్షితమైన సుద్దుల భాష.
 అల్లిబిల్లి మల్లెల్లో గుభాళించు పరిమళం ఆచంధ్ర బింభంలో నెలకొన్న చల్లదనం తేనెలోన దాగివున్న తీయదనం పంచదార ఖండచెక్కర చెరకు సరకులన్నింటినికలగలిపితే లభించు పంచామృతం కన్న మిన్న నా మాతృభాష యన్న నీవికనైన తెలుసుకొని కలుసుకొని నడుచుకోరా చిన్నా మరి మరువకు నీవు కన్నా.
పక్షులకు సహితం నోటి మాట నేర్పినట్టి చిట్టి పొట్టి చిలకలెన్నో చన్నగాను పిన్నగాను పలికిన భాష
తెలుగు జాతి గౌరవాన్ని విశ్వమంత చాటినట్టి చక్కని భాష
తేట తేట చాటువుల బావుటా ను ఎత్తి కీర్తిని నిలబెట్టిన గట్టి భాష
మధురమైన మన భాష మన అందరి భాష ఈమన భాష ఉన్నతికై పాటుపడుదాం అమేషా..
ఈ కవిత నా స్వంత రచన.మరే దానికి అనుకరణ కాదు.మరే మాద్యములలో గూడ పెట్టలేదు.
కాన హామీ ఇవ్వనైనది