మేం నేటితరం బాలకులం
మా భావితరం పాలకులం
మా తెలుగుతల్లి పిల్లలం
సదా వెలుగుతున్న మల్లెలం.
మా కులం బాల కులం
మా బలం ఆత్మ బలం
మాకు రారు ఎవరు పోటి
మాకు లేరు మరెవరుసాటి.
మా బడిలో గురువును అర్తిస్తం
ఆ చదవులమ్మను మేం ప్రార్తిస్తం
మేం చదువుల వరమును కోరుతం
మా పదవుల శిఖరమును చేరుతం
మేం మా గురువుల వెంటే ఉంటాం
మా గురుభోధనల సదా వింటాం
మేం చదువుల మధనం చేస్తాం
మా పదవుల వదనం చూస్తాం.
మేం మా భరతమాత పుత్రులం
దానశీల సద్గుణధాత్రులం ఇల వేల్
మేం మా దేశసేవకు ఉపక్రమిస్తం
మా దేశభాశలను నిత్యం ప్రేమిస్తాం
బాలకులం-పాలకులం:---గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి.సెల్,నెం. 9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.