మన గణతంత్ర దినోత్సవం :-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి--సెల్,9491387977.
 నేడే మన దివ్యమైన గణతంత్ర దినోత్సవం ఈనాడే జన సవ్యమైన స్వర్నోత్సవం అమరులైన మన త్యాగధనుల స్మరిస్తూ చలిస్తూ మనం నిర్వహిస్తున్న స్మరణోత్సవం
స్వాతంత్ర సమరం సాగించిన గాంధీజీ స్వాతంత్రగా రాజ్యాంగ రచన గావించిన అంబేద్కర్ జీ రారాణి రుద్రమ్మ ఝాన్సీరాణీల త్యాగఫలం మనం అనుభవిస్తున్నాం ఈ గణతంత్ర దినోత్సవం నిర్వహిస్తున్నాం
మన భారతీయ అమరులైన మహనీయులందరికి మనం హారతీయ కలిసిమెలిసి రావాలి ముందరికి గణతంత్ర దినోత్సవాన్ని మనం ఘనంగా నిర్వహిద్దాం ఆ మహనీయుల పూజకు సర్వం సిద్దం చేద్దాం
మన భారతీయ భరతమాతకు అర్పిద్దాం గణంగా మనమంతా మనందరి నివాళులు నిజంగా ఈ దినమంతా తిరంగ పతాకాన్ని చేతబట్టి ఎత్తుదాం ఆకాశం నిండా అంగరంగ వైభవంగా విత్తుదాం దేశభక్తి బీజాలను గుండె నిండా. 
రండి రండి మెల్కొనండి దేశభక్తులై మీరండిలెండిలెండి ఏలుకొండి ఈ దేశం ఔన్నత్యం మీ చేతుల్లో నే ఉందండి అదరవద్దు బెదరవద్దు అజాగ్రత్తగా ఇక ఉండవచ్చు కలిసిమెలిసి ఈ పొద్దు మన ఐక్యతను చాటుకుంటె ముద్దు.