మేం పవన పుత్ర పొట్టి పిల్లలం
మా ధవళనేత్ర గట్టి మల్లెలం
కవన కీర్తి ఆశించిన వారలం
మా జీవనార్తి భాశించిన పోరలం
సదా సమావేశాలు జరిపిస్తం
యధావిధి అంశాలను వివరిస్తం
ప్రతిభాపాఠవాలకు స్పందిస్తం
ప్రతిభా పురస్కారాలు అందిస్తం .
ప్రత్యేక ఆహ్వానితుల పిలిపిస్తం
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కలిపిస్తం
విచ్చేసిన వారిని మేం అర్థిస్తం
అచ్చేసిన గ్రంధాలు సమర్పిస్తం.
కవి సమ్మేళనములను జరిపిస్తం
కవి కోవిదులను మేం మురిపిస్తం
అవార్డులు రివార్డులు అందిస్తం
మా బోర్డు రికార్డుల విందుస్తం .
మేం జరుపు మా కవితా గోష్టులకు
ఫోటోగ్రాఫర్లు కూడా వస్తుంటారు
గ్రాఫిక్ ఫోటోలను వారు తీస్తుంటరు
పత్రికలకు వాటిని పంపిస్తుంటరు.
వసారాలో కవితా గోష్టి జరిపిస్తం
మనసారా కవితలతో మురిపిస్తం
సాహితీ వెత్తలను ఆహ్వనిస్తం
సాహితీ ఉత్తముల సన్మానిస్తం
పత్రికా విలేఖరుల పిలిపీస్తం
ప్రచురణ అంశాలను వివరిస్తం
సమావేశ నిర్వహణలో జీవిస్తం
పరిపూర్ణత చెందామనిభావిస్తం.
కవితా గోష్టి పిల్లలం:---గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్,నెం.9491387977.