గాంధీజీ ప్రకృతి వైద్యం:--గుర్రాల లక్ష్మారెడ్డి,కల్వకుర్తి.--సెల్,9491387977.

 స్వాతంత్య్రం  అందించిన  

మనగాంధీతాత ప్రకృతి

వైద్యాన్ని ఆచరించిన

మన ప్రియతమ నేత.


మానవ మస్తిష్కానికి

మేక పాలు బలమన్నాడు

గృహస్తులకేమో గోవు పాలు ఇల నెలవన్నాడు.


పరిసరాల సంచరించు

పాడి పశువుల ప్రేమించ

తాను పూనుకున్నాడు

ప్రకృతివైద్యం ఆచరిస్తుండే

వాడే ఇలధన్యుడన్నడు.


సబర్మతీ ఆశ్రమందు

గోవులకు చోటిచ్చెను

గోమూత్రం దవ్యౌషదం

అని తను చాటించెను


ప్రకృతి వనమూలికల

సేకరించమన్నడు

ఔషదంగ మార్చుకొని

నిత్యం స్వీకరించమన్నడు


చెప్పడమే కాకుండా తాను

ఆచరించి చూపిన వాడు

ప్రకృతి వైద్యం ఘనతను

చాటిన మనఅందరివాడు


మానవ ఆరోగ్యానికి ఈ

ప్రకృతివైద్యం శ్రీరమరక్ష

దైవం మనకందించిన బిక్ష

యని గాంధీ తాత చెప్పె

ఈవైద్యం గుట్టుతానువిప్పె


ఇదే ఇదే గాంధీజీ తత్వం

ప్రకృతి వైద్యం ఔన్నత్యం

పాటిద్దాం మనమంతా

చాటిద్దాం ఈదేశమంతా.


హామీ పత్రం

ఈకవిత నాస్వంతరచన

దేనికి అనుకరణ కాదు

మరేమాధ్యమములోను

పెట్టలేదు.కనహామి

ఇవ్వనైనది.

-----------------------------

mail, gurralalaxmareddy033@gmail.com