భుగభగ పొగలు వదిలేస్తూ
చకచక రైలు వస్తూంది
మక్కువతో మేం ఎక్కేస్తాం
మా చక్కని ఢిల్లీ చూసొస్తాం.
కుర్రాళ్ళం మేం టక్కేస్తాం.
ఎర్రని మా బస్సులో ఎక్కేస్తాం
హైదరాబాదు వెళ్ళొస్తాం
చార్మినారును చూసాస్తాం
విమానమూ మేం ఎక్కస్తాం
ఆకాశంలోహాయిగ విహరిస్తాం
చుక్కలతో చేస్తాం మేం నేస్తం
దిక్కులన్నీ తిరిగి లెక్కిస్తాం.
సూటూ బూటు చక్కగ వేస్తాం
నీటి బోటులో మేం ఎక్కేస్తాం
జల పుష్పాలతో స్నేహం చేస్తాం
అల ద్రృశ్యాలను చూసేస్తాం.
అప్పుడప్పుడు ఆటోనూ ఎక్కేస్తాం
మీటరు చూసి ఠక్కున లెక్కేస్తాం
డబ్బులు వెంటనే మేం ఇచ్ఛేస్తాం
దొరబాబులా మాఇంటకి వేంచేస్తాం
ఎడారి ఓడను మేం ఎక్కేస్థాం
సహారా ఎడారిని చెక్కేస్తాం
ఓయాసిస్సుల చూసొస్తాం
ఉషస్సు వేలుగులో తిరిగొస్తాం.
పాపల ప్రయాణం:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.-నాగర్ కర్నూల్ జిల్లా.సెల్,నెం.9491387977.