ఆడ ఈడ ఉండేటి ఆడపిల్లలంతోడు నీడ చిందేటి జోడు మల్లెలం
ఆడ ఉండి అత్తమామల ప్రేమిస్తం
ఈడ ఉండి అమ్మనాన్నల పూజిస్తం
చెమ్మచెక్కలాడేటి ఆడపిల్లలం
అమ్మపక్కచేరేటి నీడ మల్లెలం
అమ్మ ఇచ్చు ముద్దులన్ని కమ్మన
నాన్న చెప్ఫు సుద్దులెన్నో గమ్మున.
కుట్లు అల్లికల పని మేం చేస్తాం
అట్లు పెసరట్ల రుచిని చూపిస్తాం
వంట తంట వెంటనే తప్పిస్తాం
ఇంట వెంట ఉండి మెప్పిస్తాం .
మగపిల్లలందరికి మేమంతా ధీటుగ
తెగ చదివేస్తం దినమంతా మేటిగ
ఆట పాటల్లో వారికన్న మిన్నగ
తెలివితేటల్లో ఎదుగుతాం తిన్నగ.
అదుపులో ఉండి పొదుపు చేస్తాం
కుదుపులేనిబతుకుబండినిమోస్తాం
మదుపు చేయడం మంచలవాటు
వడుపుంటే కలగదులే ఇక చేటు.
ముంగిట్లోబాగా ముగ్గులు వేస్తాం
అంగట్లో వేగా సరుకులు తెస్తాం
జీవనోపాధి నిధులను సాధిస్తాం
జనజీవన స్రవంతిలోమేం జీవిస్తాం
మేం చెడుగుడు ఆటను ఆడుతాం
అడుగిడి మా పాటను పాడుతాం
ఆడపిల్లలమని మీరసలనుకోవద్దు
ఆడ ఈడ ఉండే మేమేగా ముద్దు.
మేం ఆడపిల్లలం.:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.-నాగర్ కర్నూల్ జిల్లా.-సెల్,నెం.9491387977.