ఉడతా ఉడతా ఓ ఉడతాశ్రీరాముడు మెచ్చిన ఉడతా
ఎక్కడికివెళ్ళవు మరి నీవు
కనిపించక ఉండే దానివి కావు.
ఉడతా ఉడతా ఓ ఉడతా
ఎక్కడ ఉన్నావు మా ఉడతా
నీ తిండి నీవు తిన్నావా
తినకుండా పస్తులు ఉన్నావా
ఉడతా ఉడతా ఓ మా ఉడతా
నీ వెక్కడికి వెళ్ళావు ఉడతా
డొప్పలు నీకై నే కుడతా
పప్పులు అందులో నే పెడతా
ఉడతా ఉడతా ఓ మా ఉడతా
బొమ్మరిల్లు నీకై నే కుడతా
బొమ్మలు అందులో పెడతా
అమ్మలందరికి నే చూపెడతా
ఉడతా ఉడతా ఓ మా ఉడతా
ఏం చేస్తున్నవు నీవు మా ఉడతా
నే ఫోటోగ్రాఫర్ ను పిలిపించా
నీ ఫోటో ఒకటి వెంటనే తీపించా
ఉడతా ఉడతా ఓ మా ఉడతా
ఏ ఊరెల్లావు నువు మరి ఉడతా
నీనోరును నువు వెంటనే విప్పు
ఆ ఊరి సంగతులను మాకు చెప్పు
ఉడతా ఉడతా ఓ మా ఉడతా
మళ్ళీ తిరిగెప్పుడు వచ్చావ్ ఉడత
నీకై నే ఎన్నైనా తిప్పలు పడతా
సోకై నీకు పప్పులు డొప్పల పెడతా
ఉడతా ఉడతా ఓ మా ఉడతా
రాముని ప్రేమను పొందిన ఉడతా
చీకట్లోనైనా నిన్ను వెతికి పడతా
కొట్లో ఉన్న పప్పు బెల్లం పెడతా
ఉడతా ఉడతా ఓ మా ఉడతా
సీతారాములు మెచ్చిన ఉడతా
అందుకే నే నీకు ఓ గుడి కడతా
ముందుగనే ఓ దండం నీకు పెడతా
చెంగు చెంగునా గంతులేసె ఉడతా
రంగురంగుల నీ ఫోటో ఫ్రేం కడతా పూజా గదిలో గోడకు నే కొడతా
రోజూ విడువక దీపం నే పెడతా.
ఉడతా ఉడతా ఓ మా ఉడతా
కట్టిన గుడిలోనే నైవేద్యం పెడతా
ఆరగించ ఇక నువు రావమ్మా
దీవించి మరి నీవిక పోవమ్మా.
మా శ్రీరాముని ఉడత:--గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.--నాగర్ కర్నూల్ జిల్లా.-సెల్,నెం.9491387977.