జాతి పిల్లలం-జ్యోతిమల్లెలం: --గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.:-నాగర్ కర్నూల్ జిల్లా.;-సెల్,నెం.9491387977..


 మేం శ్వేత జాతి పిల్లలం

మా జ్ఞానజ్యోతి మల్లె లం

ప్రజ్ఞ ఉన్న వారలం మేం

విజ్ఞానం కన్నపోరలం


తోటివారికి సాయం చేస్తాం

మా బోటి వారికి చేయందిస్తాం

పక్క వారి ప్రేమకు స్పందిస్తాం

ఎంచక్కా కలిసిమెలిసి జీవిస్తాం


దేశ సేవ చేయుట మాకు ముఖ్యం

సేవలోనే ఉందిలే ఎంతో సౌఖ్యం

దేశ సేవకే మేంచేస్తాం పోరాటం

ఆశ చావకే మాలో మిగిలే ఆరాటం


అరాచక శక్తుల అనగగొట్టుతం

మోరాయిస్తేతాడుమెడకుచుట్టుతం

ఆ పై వారిని చర లోకి నెట్టుతం

ఇకపై విడువద్దని పట్టు పట్టుతం 


కులతత్వం కుడ్యాలను కూల్చేస్తాం

మతతత్వంమౌడ్యాలనుమార్చేస్తాం

కులం మతం తోలును వలిచేస్తాం

జనం హితం కోరిమేలును చేస్తాం


నీతి రీతి తప్పెటోళ్ళము కాము

మంచి చెడ్డ విప్పటోళ్ళము మేము

కలసిమెలసి అందరితో ఉంటాం

అలసి సొలసినమేం ఆదుకుంటాం


ఊరి వారి కష్టాలను తొలగిస్తాం 

చేరి కోరి మా ఇష్టాలను గెలగిస్తాం

 జన సంక్షేమానికి పని చేస్తాం

ఘన సంకీర్తన కై .ఇక చూస్తాం.


మా దేశం సంస్కృతి మాకిష్టం

ఆదేశంతో చేస్తాము స్పష్టం

అష్టకష్టాలొచ్చినా హాయిగ ఉంటం

ఇష్టసఖుల నష్టాల తపిస్తుంటం.