చిత్రాల పిల్లలం:--గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.-నాగర్ కర్నూలు జిల్లా.-సెల్,నెం.9491387977.

 


అందమైనచందమామ పిల్లలం

పొందికైన కుందనాల బొమ్మలం

చలనచిత్రాలు తీసేటి వారలం

ఇలన గోత్రాలు వ్రాసేటి పోరలం


కొత్త పాత నటులతో చిత్రం తీస్తాం

రిత్తవోని సత్తా ఉన్న గాత్రం ఇస్తాం

వీక్షించిన జనం ఇస్తారులే రివార్డు

ఆకాంక్షించిన ధనంతో సృష్టిస్తాంరికార్డ్


ఓ యదార్థ సంఘటన తీసుకుంటం

మేమంతా నిర్ధారణ చేసుకుంటాం

దృశ్యకావ్యంగా  దాన్ని మలుస్తం

అదృశ్య హస్తం గామేము నిలుస్తాం


డైలాగులుచెడకుండాచెప్పుతుంటం

డైలమాలోపడకుండాతప్పుకుంట

చిత్రాల్లో నటించే చిట్టి పిల్లలం మేం

పత్రాలను పఠించే పొట్టి మల్లెలం.


పౌరాణిక చిత్రాలను తీస్తుంటం

పారాయణమంత్రాలనుపఠిస్తుంటం

నిర్మాతలకు వాటిని చూపిస్తుంటం

నిర్మించుటకు అంగీకరిస్తుంటం.


కామెడీ చిత్రాలను చూపిస్తాం

మెలోడి గాత్రంతో పాటలు వేస్తాం

ఆటపాటలతో అందరినిమురిపిస్తం

అదరహో అని వారిచే అనిపిస్తంచారిత్రక చిత్రాలను గూడ తీస్తాం

పవిత్ర దృశ్యకావ్యాలుగ మలుస్తాం

దేశవిదేశాల్లో షూటింగ్ ప్లానులేస్తాం

నటవిరాట నటులనే పిలిపిస్తాం.