గురువులకు వందనం:-గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్,నెం.9491387977.

 నవమాసములు తన గర్భంలో మోసి నా హృదయ ఫలకం పై ఓనమాలు వ్రాసి అక్షరాస్యునిగా మార్చి నాకు జన్మనిచ్చి ఈ ప్రపంచానికి పరిచయం చేసిన నా కన్నతల్లి నా మొదటి గురువు ఆమే నాకాదెరువు ఆ అమ్మ గురువుకు వందనం అభివందనం నానందనం 
పసిప్రాయమందు బడిలో నాకు పాఠాలు చెప్పి ఆగుడిలో వినయవిధేయతల చిట్టాను విప్పి నా వ్రేలు పట్టి ఇసుకలో అక్షరాలను ,,దిధ్ధించి నాలోని అగ్నానాన్ని తొలగించిన వాడు
విగ్నానాన్ని అందించి ఆదరించిన రేడు చదువులో రెట్టించి ప్రోత్సహించిన మా మాస్టారు మా రెండవ గురువు వారికి నా వందనం నందనం అభివందనం.
పలకా బలపం ఇప్పించి బడిలో నన్ను చేర్పించి రోజు తా నీడై తోడై సైకిల్,పై నిత్యం బడికి నను మోస్తూ నా అవిటితనాన్ని మరిపించి మురిపించిన మా ముద్దుల నాన్న మా మూడవ గురువు మా కాదెరువు  ఇట్టి త్రిమూర్తులైన గురువు లందరకు నా వందనం నందనం అభివందనం.