నీ చేతిలో చిల్లి గవ్వయైనా లేదు
ఏ నూతిలో నీటి చుక్కైనా లేదు
ఏం పండిస్తాం పచ్చనైన పంటల
ఏంజతకూడుస్తాం వెచ్చనైనజంటల
అంటూ వేళ్ళు నీవు గిల్లుకుంటూ
నీలోనీవే సదా కుములుకుంటూ
కాళ్ళు ముడుచుకొని కూచుంటే
కదలి వస్తుందా కబలం ముందుకు
వదిలి పోతుందా నీ దరిద్రం ఒకందుకు ఓ మా నేస్తం.
పండుగొచ్చిందని పరవసించకు
మెండుగ దరిద్రంఉన్న బ్రతుకుల్లో
నిండుగా గ్రాసం లేని ఈలోగిళ్ళో
పండుగ ఎలాచేసుకుంటంనిండుగ
నీఆశను ఆశయాన్ని వదులుకోకు
వేదనకు ఆవేదనకు గురికాకు నేస్తం
తెలుసుకొని మసలుకుంటే వాస్తవం
తెలిసిపోవు బ్రతుకులోని సమస్తం
ఆదేవుని లీలా వినోదం అంతా
నిమిత్తమాత్రులం మనం కొంత
అని అనుకోవద్దు చేసుకో రద్దు
కని నీతలరాతను నీవే సరిదిద్దు
నీవు గాలిలోన దీపం పెట్టొద్దు
దేవా నీవే దిక్కని అనవద్దు
నీ ప్రయత్నం నీవు చేస్తే నిత్యం
ఫలితం నీకు దక్కుట సత్యం
ఓ మా నేస్తం.:-గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి--సెల్,9491387977.