ఓ మాయదారి కరోనామా చదువులను దూరం చేసావు
మాలో ఉన్న జ్ఞానాన్ని
అంధకారంలో పడేసావు
మాకు వెలుగులు లేకుండా చేసావు
మమ్ములను గురు విద్యకు దూరం చేసావు
గుడ్డి వాళ్ళ లాగ మమ్ములను మార్చేసావు
మేము ఒక్కో ప్రగతి మెట్టు ఎక్కు తుంటే
ఆ మెట్లు లేకుండా కరోనా నీవు కూల్చేసావు
మా విద్యార్థుల భవిష్యత్తుని మన్ను పాలు చేసావు
మేమేమీ చేసామమ్మ నేరము
మా ప్రగతి పునాదులను కూల్చేసావు
కరోనా నీ వల్ల మానవ జీవితానికి ఎంత కష్టమాయే..
కరోనా మాయ..:- డి.అభిలాష్ప--దవ తరగతి జి.ప. సె.పాఠశాల తడపాకల్ జి.నిజామాబాద్ తెలంగాణ..9553576697..