31. ఆ.వె. ఈర్ష్య పెంచుకోకు మితరుల పైననునిన్ను గాల్చివేయు నిప్పు పగిది
కౌరవాగ్రజుండు కదనాన చావడే
రమ్య సూక్తు లరయు రామకృష్ణ.
32. ఆ.వె. జాతి మతము లీల జగతిలో మనకును
మంచి జేయు వారు మహిని గొప్ప
బ్రౌను చేసే తెలుగు భాషకు సేవను
రమ్య సూక్తులరయు రామకృష్ణ.
33. ఆ.వె. సాటి వారితోని చనువుగా నుండుము
ఆదుకొనుము వారి నార్తి నుండి
కరుణ చూపు మనెను గౌతమ బుద్ధుడు
రమ్యసూక్తులరయు రామకృష్ణ.
నీతి పద్యాలు: --సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య ధర్మపురి మొబైల్: 9908554535