37. ఆ.వె. దేశభక్తి తోడ తేజరిల్లుము నీవువందెమాతరమని వాయినిండ
భగతుసింగు కీర్తి పరిఢవిల్లె జగతి
రమ్యసూక్తులరయు రామకృష్ణ.
38. ఆ.వె. పిల్లలందరి యెడ ప్రేమ కలిగి యుండు
సత్యము పలికెదరు చక్క గాను
పొగడెను నరహరిని పుడమి ప్రహ్లాదుడు
రమ్యసూక్తులరయు రామకృష్ణ.
39. ఆ.వె. దుష్టసఖుని విడువు దుర్మార్గుడతడును
వాని పొందు వలదు వసుధ లోను
కాటు వేయు మనల కట్ల పామైననూ
రమ్యసూక్తులరయు రామకృష్ణ.
నీతి పద్యాలు:--సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురిమొబైల్: 9908554535.