40. ఆ.వె. ఇతరులెవరు నన్ను నెరుగలేరంచునుతప్పు చేసిన నది నిప్పు గాదె
కళ్ళు మూయు పిల్లి కానరె జగమంత
రమ్య సూక్తులరయు రామ కృష్ణ.
41. ఆ.వె. బుద్ది పదును పెట్టు భూమి యందును నీవు
ఆచరణము పెట్ట యలఘు సుఖము
అయ్యె రాష్ట్రపతిగ అబ్దుల్ కలాం గాదె
రమ్య సూక్తులరయు రామ కృష్ణ.
42. ఆ.వె. అగ్ని కీలలు గని యంగలార్చకు నీవు
తెరువు జూచి వెడలు తెలివి గాను
భీముడు బయటపడె పిన్న పెద్దల తోడ
రమ్య సూక్తులరయు రామ కృష్ణ.
నీతి పద్యాలు:---సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి మొబైల్: 9908554535.