నీతి పద్యాలు: ---సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి మొబైల్: 9908554535.


 43. ఆ.వె. దానగుణము చేత ధరలోన భాసిల్లు

                బీద వారి కొసగు  ప్రీతి మిగుల

               కర్ణుడిచ్చె ప్రజకు కామితార్థములన్నీ

               రమ్య సూక్తులయు రామకృష్ణ.


44. ఆ.వె. శాంతి తోడ నుండ సకల జనులు మెచ్చు

                నూరి వారి తోడ పోరు తగదు

                 గాంధిమాట పైన గౌరవమ్ము మనకు

                రమ్య సూక్తులరయు రామకృష్ణ.


45. ఆ.వె. తెలుగు వెలుగులెపుడు దిక్కులన్నిట చాటు

                 మాతృభాష నీవు మరువబోకు

                 కృష్ణరాయ కీర్తి కెదురేది జగతిలో

                 రమ్య సూక్తులరయు రామకృష్ణ.