28. ఆ.వె. కోపమునకు హద్దు కోరికలణచుటఇంద్రియముల నుంచు మెపుడు నదుపు
దూరముంచిరంత దుర్వాసుని జనులు
రమ్య సూక్తులరయు రామ కృష్ణ.
29. ఆ.వె. స్నేహ ధర్మమిలను నిష్టగా పాటించు
పొందు మిష్ట సఖుల పుడమిలోను
ఆ కుచేలుడొందె హరి వల్ల లాభము
రమ్య సూక్తులరయు రామ కృష్ణ.
30. ఆ.వె. ఇతరుల ధనమునకు నెదిరి చూడవలదు
పరుల యాస్తి పొంద పాప మగును
తేనె తుట్టె కొట్ట తెగువ నీగలు కుట్టు
రమ్య సూక్తులరయు రామ కృష్ణ.
నీతి పద్యాలు: --- సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి--మొబైల్: 9908554535.