భరత పుత్రుడా!(గేయ సూక్తులు):డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల--9948089819


 మానవత్వము గుండె లోపల

మనోహరముగ పూసి నప్పుడె

శాంతి యలరును కాంతి విరియును

సమత కోరే భరత పుత్రుడ! 79


గుండె లోపల బరువు బాధల

కుంపటేమో రగులు చుండిన

బాధ లన్నియు తీరి నంతనె

ప్రమద మే కద భరత పుత్రుడ! 80