భరత పుత్రుడా!(గేయ సూక్తులు):-డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల 9948089819


 స్నేహ తత్త్వమే నాదు మతమని

సగర్వంగా నుడువ వలెరా

స్నేహమే మన జాతి బలగము

చిరుత నగవుల భరతపుత్రుడా! 85


ఆత్మ బలమే తోడునుండగ

అడుగు ముందుకు వేయ వలెరా

ప్రగతి మాటల మల్లె మాలలు

పరచు కోవలె భరతపుత్రుడా! 86