భరత పుత్రుడా!(గేయ సూక్తులు): -డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల-9948089819


 తల్లి దండ్రుల మంచి మాటలు

చెల్ల వికయని తలచబోకుర

వారు చెప్పే బోధ సారము

భవ్య పథముర భరతపుత్రుడా! 87


మధుర భావన చిందు నట్టుల

పదములల్లర నెల్ల వేళల

పదము లందున కూజితమ్ముల

పదనిసలుగన భరతపుత్రుడా! 88