భరత పుత్రుడా! (గేయ సూక్తులు):-డాక్టర్. కొండబత్తిని రవీందర్-- కోరుట్ల. జిల్లా. జగిత్యాల-- 9948089819


 ముద్దు ముద్దుగ మాట లాడిన

మోద సుమములు పరిమళించును

రోత మాటలు మాట లాడిని

రోసు కొందురు భరత పుత్రుడ!  93


పరుల కోసము బ్రతుకు వారిని

ధరణిమెచ్చును యెల్లవేళల

స్వార్ధ తత్వము తోడ జనులను

చంప బోకుర భరత పుత్రుడ!  94