భరత పుత్రుడా!(గేయ సూక్తులు):-డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల 9948089819


 బీదసాదల బ్రతుకు నందున

ప్రేమదీపము వెలుగ వలెరా

బీద యన్నను భక్తి భావము

పెరుగ వలెరా భరత పుత్రుడ! 95


ద్వేష భూజపు వేర్లు నరికిన

తేజరిల్లును దివ్య దేశము

ప్రేమతత్వము వెల్లివిరియగ

ప్రియము కోరర భరత పుత్రుడ! 96