భరత పుత్రుడా!(గేయ సూక్తులు):-డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల 9948089819

 తల్లిదండ్రుల సేవచేసిన
తనయుడే యిల గొప్ప వాడగు
తల్లిదండ్రుల సేవమరచిన
తనువు నుసియగు భరతపుత్రుడ!103

విద్య నొసగిన గురువు నెప్పుడు
విలువతో పూజించవలెరా
గురువు యొసగే నీతి మాటలు
తరుగబోవుర భరతపుత్రుడ! 104