భరత పుత్రుడా! (గేయ సూక్తులు):- డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల-9948089819


 నీవు నేనను వాడు వీడను

భావ మెందుకు భావ మందున

గుండె లన్నియు కూడి యుండిన

దండి బలగము భరతపుత్రుడ! 73


కాల నాగులు కాటు వేసిన

కార్య దీక్షను మాను కోకుర

పట్టు దలయే ప్రగతి మెట్టని

బాసచేయర భరత పుత్రుడ!  74