భరత పుత్రుడా! (గేయ సూక్తులు): డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల 9948089819


 అసుర భావన లోన మునిగిన

అంతమగు నీ యశో మాలిక

సర్వ జీవుల హితము కోరిన

గర్వ పడెదరు భరతపుత్రుడ!  75


బ్రతుకు భారము తోడ ప్రాణులు

వెతల గుట్టల నలిగి పోయిన

వివేకముతో తొలగద్రోసిన 

భవిత కలదుర భరతపుత్రుడ! 76