కొన్ని అడవి యాలకులను తీసుకుని శుభ్రంగా కడిగి నీటిలో వేసి కొన్ని లవంగాలను కలిపి బాగా మరిగించి చల్లార్చి కషాయంగా త్రాగితే చిగుళ్ల వాపు, పళ్ళు నొప్పులు, నోటి దుర్వాసన అన్నీ పోయి నోరు శుభ్రపడుతుంది.అడవి యాలకులను నీళ్లలో వేసి కొద్దిగా జీలకర్ర దాల్చిన చెక్క పొడి కొన్ని లవంగాలు కలిపి బాగా మరిగించి చల్లార్చే తేనె కలిపి త్రాగాలి. ఇది శరీరంలో రక్తప్రసరణను క్రమబద్ధం చేస్తుంది. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ రాకుండా కాపాడుతుంది. ఉదరంలో సమస్యలు రానివ్వదు.అడవి యాలకుల కషాయంలో తేనె కలిపి త్రాగితే వాంతులు రావడం, తల తిరగడం లక్షణాలు తగ్గిపోతాయి.
అడవి యాలకులు( Black Cardamom )... : పి . కమలాకర్ రావు