సామెత కథ : ఎం . బిందు మాధవి


 నోరు మాట్లాడుతుంటే నొసలువెక్కిరించింది!


 


‘ప్రభ’ వాళ్ళ ఇంటికి చిన్న నాటిస్నేహితురాలు ‘ప్రియ’ వచ్చింది. ప్రభ వాళ్ళఆయన బిల్డర్. ఇల్లూ వాకిలి కొంచెంహోదాగానే ఉంటాయి. చాలా కాలంతరువాత అనుకోకుండా పక్క ఇంటికి వచ్చినప్రియ- ప్రభ వాళ్ళు అక్కడే ఉంటారని తెలిసివీళ్ళ ఇంటికి వచ్చింది. అనుకోకుండా వచ్చినచిన్ననాటి నేస్తాన్ని చూసి ప్రభ ఆనందంతో, లోపలికి ఆహ్వానించి కూర్చోమని చెప్పి, లోపలికి అతిధి మర్యాదలు చెయ్యటానికివెళ్ళింది. భర్త కికూడా ఫోన్ చేసి చెప్పింది, వీలైతే త్వరగా రమ్మని.


ఇక ప్రియ, వస్తూనే రెండు కళ్ళతోఇంటిని ఆసాంతం చూసి వీళ్ళ హోదానిఅంచనా వెయ్యటం మొదలుపెట్టింది. కానీఅది పైకి కనిపించకుండా ‘నీకెంత మందిపిల్లలు, వాళ్ళేం చేస్తున్నారు’ అని అడిగింది. ప్రభ చెప్పేలోపే ప్రియ మధ్యలో కలగచేసుకుని, ‘ఏవో ప్రొఫెషనల్ కోర్స్ లే చేస్తూఉంటారు. నీలాగే మంచి తెలివైన వాళ్ళేఅయి ఉంటారు. చిన్నప్పుడు నువ్వూ అంతేకదా, క్లాస్ లో అన్నిట్లో ముందు ఉండేదానివి’ అని మెచ్చుకుంటూనే ‘డబ్బుకేంతక్కువ లేదు కదా, బాగా డొనేషన్లు కట్టిమంచి కాలేజ్ లోనే చేర్చి ఉంటావు’ అన్నది.


ఈ ధోరణి ప్రభకి కొంచెం కొత్తగా ఉన్నది. ‘ఏదో పాత నేస్తం, ఇన్నాళ్ళకి వచ్చింది’ అనిసంతోష పడితే ‘ఇలామాట్లాడుతున్నదేమిటి’ అని కొంచెంచిన్నబుచ్చుకున్నది. అది పైకికనిపించకుండా, ‘మా అబ్బాయిహ్యుమానిటీస్ లొ డిగ్రీ చదువుతూ, తనకిష్టమైన సంగీతాన్ని ఫుల్ టైం ప్రొఫెషన్గా చేసుకోవాలనుకుంటున్నాడు. నాకు, వాళ్ళ నాన్నగారికి కూడా అదేమీ పెద్దఅభ్యంతర పెట్ట వలసిన విషయం అనిఅనిపించలేదు కనుక సరే అన్నాము. వాడుఅదే చేస్తున్నాడు’ అని చెప్పింది. 


ప్రియ అది వింటూనే ‘అవునులే మీరుబాగానే సంపాదించారు, రెండు తరాలుతిన్నా తరగని ఆస్తి, అతను ఇంకాసంపాదించాల్సిన అవసరంఏముంది,కనుక అతనికిష్టమైన వ్యాపకంవెతుక్కోవచ్చు’ అన్నది. ప్రభకి ప్రియమెచ్చుకుంటున్నదో, విమర్శిస్తున్నదోతెలియని స్థితిలో పడింది.


ఊళ్ళో పక్కింటి ఆవిడ వచ్చి ఇలాగేమాట్లాడితే, ఆవిడ “నోటితో మాట్లాడుతూనొసటితో వెక్కిరిస్తుంది”, అందుకని అన్నివిషయాలు అందరితోనూ మాట్లాడకూడదుఅని తన అమ్ముమ్మ చిన్నప్పుడు అన్నమాటలు ప్రభ గుర్తు తెచ్చుకుంది.