తాత తాత ముత్తాత
బోసినవ్వుల మా తాత
ముద్దుగా నీవు వస్తావా
ముద్దులు నీవు ఇస్తావా
సజ్జ రొట్టెలు తెచ్చాము
మెత్తగా నీవు తింటావా
పూర్వం సుద్దులు చెపుతావా
చక్కగా మేము వింటాము
నేతి బూరెలు తింటావా
నీతి కథలు చెపుతావా
కథలు శ్రద్ధగా వింటాము
కథలో నీతిని నేర్చెదము
తోటి పిల్లలను పిలుస్తాము
వారికి కథలు చెప్పే దమ్ము
ఐక్యతను మేము చాటెద ము
హాయిగా ఆటలు ఆడెదము
ముత్తాత బాల గేయం:--ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట